Ameenpur 3 Children Case: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాలు అనేక కాపురాలను కూల్చుతున్నాయి. భాగస్వాముల హత్యలకు కూడా తెగిస్తుండటంతో కన్నబిడ్డలు అనాథలవుతున్నారు. కొందరైతే కన్న బిడ్డలనే కనికరం లేకుండా వారిని కూడా హత మారుస్తున్నారు. ప్రియుడి మోజులో పడి ఇటీవల ముగ్గురు పిల్లలను చంపిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడిని కూడా కటకటాల వెనక్కి నెట్టారు.
ప్రియుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ మహిళ తన కన్న బిడ్డలకు విషం ఇచ్చి హతమార్చిన ఘటన ఇటీవల అమీన్పూర్లో కలకలం రేపింది. ఈ ఘటనపై ఆ ముగ్గురు పిల్లల తండ్రి గుండెలు పగిలేలా ఆవేదన చెందుతున్నాడు. తనను నమ్మించి.. తన భార్య గొంతు కోసిందని.. తన ప్రాణానికి ప్రాణమైన పిల్లల్ని అతి కిరాతకంగా హత్య చేసిందని అంటున్నాడు. తాజాగా తన బాధను మీడియాతో పంచుకున్నాడు.
Also Read: 7 Year Old Boy Murder: ఏడేళ్ల బాలుడిపై దారుణంగా హత్య
తనతో ఉండటం ఇష్టం లేకపోతే.. తనకు చెప్పకుండా ఇష్టం ఉన్న వాడితో వెళ్ళిపోవాల్సిందని బాధను బయటపెట్టాడు. పిల్లలకి విషమిచ్చి ఊపిరి ఆడకుండా చంపేసి.. తాను యాక్టింగ్ చేసిందని.. ఆ విధంగా తప్పించుకోవాలని చూసిందని అన్నాడు. తన ఆస్తి కోసమే ఆమె ఇదంతా చేసిందని అన్నాడు. అందువల్లనే ఇంత క్రూరత్వానికి పాల్పడిన తన భార్యను, దీనికి కారణమైన శివను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు. తాను చనిపోయినా బాగుండేదని.. బతికుండి క్షణక్షణం చస్తున్నానని గుండె పగిలే మాటలు మాట్లాడాడు. క్షణక్షణం తనకు తన పిల్లలే గుర్తొస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఓ తల్లి తన కన్న బిడ్డలను చంపిన ఘటన అమీన్పూర్ లో చోటుచేసుకున్న ఘటనలో సంచలన విషయాలు బయటకువచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ పరితోష్ పంకజ్ మీడియాకు వెల్లడించారు.

