Seethamma Vakitlo Sirimalle Chettu: సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ లు హీరోలుగా సమంత, అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన అందమైన కుటుంబ కథా చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దశాబ్దం కితమే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత థియేటర్స్ లో రీరిలీజ్ అయ్యింది. ఈ సినిమా అప్పుడు హిట్ అయ్యి తనకి మంచి లాభాలు కూడా అందించింది అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఇక మళ్ళీ కొత్త సినిమా తరహా లోనే మంచి ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కూడా హిట్టు గానే నిలిచిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఆడియెన్స్ అదిరే రెస్పాన్స్ ని అందిస్తున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా సీన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తానికి మళ్ళీ ఈ మల్టీస్టారర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని చెప్పాలి.
