Seethakka : బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఓట్లు దొంగిలించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆమె మండిపడ్డారు. ఆధారాలతో సహా బయటపెడితే బీజేపీ తట్టుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా మార్చుకుందని సీతక్క విమర్శించారు.
“బీజేపీ వాళ్లు నిజమైన రామభక్తులైతే, ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలి” అని ఆమె సవాలు విసిరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బీజేపీకి ప్రజలే అడ్డుకట్ట వేస్తారని, గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటారని సీతక్క స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి యావత్ దేశం అండగా ఉందని ఆమె పేర్కొన్నారు.

