Scotland: ఈ విచిత్రం ఈనాడు జరిగింది కాదు.. ఒకటి, రెండు కాదు.. 10, 20 కానేకాదు.. సరిగ్గా 193 ఏళ్ల నాడు ఆ అరుదైన ఘటన చోటుచేసుకున్నది. మరి ఆనాడు జరిగిన ఈ వింత ఘటనకు కారణాలు ఆనాడు దొరకలేదు. దొరకలేదని సైంటిస్టులు ఊరికే లేరు. పరిశోధనలు సాగిస్తూనే ఉన్నారు. ఆనాటి పరిస్థితులను ముందు తరాలకు అందిస్తూనే ఉన్నారు. ఇలా మూడు నాలుగు తరాల తర్వాత ఆ అనంత మర్మాన్ని పసిగట్టగలిగారు. ఆ పరిశోధనలో మరో ప్రమాదాన్నీ వారు పసిగట్టగలిగారు.
Scotland: సరిగ్గా 1831 సంవత్సరం.. ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం కనువిందుగా కనిపించింది. కానీ, అది ప్రమాదానికి సూచిక అని ఆనాడు తెలియనేలేదు. ప్రపంచమంతటికీ ఆనాడు సూర్యుడు నీలివర్ణంలో దర్శనమిచ్చాడు. అన్ని దేశాలు చూసి వదిలేశాయి. కానీ స్కాట్లాండ్ పరిశోధకులు మాత్రం వదలలేదు. తమ పరిశోధనను కొనసాగిస్తూనే వచ్చారు. సూర్యుడు నీలివర్ణంలోకి మారడానికి అసలైన కారణాన్ని ఈనాడు పసిగట్టారు.
Scotland: ఎట్టకేలకు స్కాట్లాండ్ పరిశోధకులు ఆ అరుదైన విషయాన్ని ఛేదించారు. రష్యా సమీపంలోని జవారిట్స్కీ అగ్నిపర్వతం 1831 సంవత్సరంలో భారీ విస్పోటనం చెందిందని, దాని నుంచి భారీగా వెలువడిన సల్ఫర్ డయాక్సైడ్ వాతావరణాన్ని కమ్మేసిందని నిర్ధారించారు. దాని కారణంగానే సూర్యగోళం నీలివర్ణంలోకి మారిందని తేల్చారు. వారి పరిశోధనలో ప్రపంచానికి మరో ప్రమాదం పొంచి ఉన్నదని తేలింది. అగ్నిపర్వత విస్పోటనం భూవాతావరణాన్ని పూర్తిగా మార్చడానికి భవిష్యత్తులోనూ అవకాశం ఉన్నదని స్కాట్లాండ్ పరిశోధకులు హెచ్చరికలు జారీ చేశారు.