Ap news: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చూసిన వైఎస్ఆర్సిపి పార్టీకి వరుస శాఖలు తగులుతున్నాయి. వారానికో నేత పార్టీ మారుతూ.. ఏదో ఒక కేసులో నేతలు అరెస్టు కావడం.. ఇలాంటి వరస సంఘటనలతో క్యాడర్లో గూగుల్ మొదలైంది. తాజాగా, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
సింహాద్రిపురం మండలానికి చెందిన హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డితోపాటు వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న అర్జున్‌రెడ్డి, పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న వర్రా రవీందర్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పులివెందుల పట్టణ పోలీసులు తెలిపారు.
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీందర్‌రెడ్డి పోస్టులు పెడుతున్నాడని, దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో ఏపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.