Tella Kagitham: హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న చిత్రానికి ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘కోర్ట్’, ‘బ్యాండ్ మేళం’ వంటి విజయాల తరువాత హర్ష్ రోషన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్, టైటిల్, ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రాబోతోందని టైటిల్, ఫస్ట్ లుక్‌ని చూస్తేనే తెలుస్తోంది.
పోస్టర్‌లో హీరో హీరోయిన్లు కనిపిస్తున్న, చుట్టూ ఉన్న విజువల్స్ చూస్తే ఇదొక అందమైన ప్రేమ కథా చిత్రమని అర్థం అవుతోంది. ఆహ్లాదకరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేశారు. నందు సవిరిగన ఈ చిత్రానికి కథ, కథనాన్ని, మాటల్ని అందించారు. లోతైన భావోద్వేగాలతో ఈ కథను రెడీ చేశారు. రమేష్ బండ్రెడ్డి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌ను సరికొత్తగా మలిచి ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.వి. గుహన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. అద్భుతమైన తారాగణంతో, గొప్ప సాంకేతిక బృందం ఆధ్వర్యంలో అందమైన ప్రేమ కథగా ‘తెల్ల కాగితం’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు: హర్ష్ రోషన్, నక్షత్ర తదితరులు
సాంకేతిక బృందం:
బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
దర్శకత్వం: రమేష్ బండ్రెడ్డి
నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
కథ, స్క్రీన్‌ప్లే & సంభాషణలు : నందు సవిరిగన
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: K. V. గుహన్
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి సూర్నెడ్డి
కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి
కో-డైరెక్టర్: రమేష్ బోనం
PRO: వంశీ కాకా
మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
పబ్లిసిటీ డిజైనర్: దివా పెద్దవీటి
