Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు

Vijay Deverakonda: టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ‘రెట్రో’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ తన ప్రసంగంలో “500 ఏళ్ల క్రితం వాళ్లు బుద్ధి లేకుండా కొట్టుకున్నారు” అంటూ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను తీవ్రంగా కించపరిచాయని గిరిజన సంఘాలు ఆరోపించాయి. అంతేకాకుండా, ఆయన వ్యాఖ్యలు పాకిస్తాన్ ఉగ్రవాదులను గిరిజనులతో పోల్చినట్టుగా ఉన్నాయి అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Vijay 69: ద‌ళ‌ప‌తి బ‌ర్త్ డే స్పెషల్ టీజర్.. ఆధారకోటినా విజయ్

ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ అశోక్ కుమార్ నాయక్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో, విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసాయనీ, ఇది SC/ST అట్రాసిటీ చట్టం, 1989 ప్రకారం శిక్షార్హమైనదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. గిరిజన సంఘాలు విజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *