SBI: ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు ప్రధానంగా కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి వర్తిస్తుంది. గతంలో ఉన్న వడ్డీ రేటు కంటే, ఇప్పుడు గరిష్టంగా 25 బేసిస్ పాయింట్లు (0.25%) వరకు పెరిగింది. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్ల గరిష్ట పరిమితిని 8.45% నుంచి 8.70%కి పెంచింది. కనిష్ట వడ్డీ రేటు మాత్రం 7.50% వద్దే కొనసాగుతోంది.
ఈ పెంపు ప్రధానంగా తక్కువ క్రెడిట్ స్కోర్ (CIBIL Score) ఉన్న కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. సాధారణంగా, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి కనిష్ట వడ్డీ రేటు వర్తిస్తుంది, కానీ తక్కువ స్కోర్ ఉన్నవారు గరిష్ట పరిమితి వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పటికీ, ఎస్బీఐ తన లాభాల మార్జిన్‌లను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల కొత్తగా గృహ రుణం తీసుకునేవారికి ఈఎంఐ (EMI) భారం కొంత పెరిగే అవకాశం ఉంది. సిబిల్ స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి కనిష్ట వడ్డీ రేటు వర్తించే అవకాశం ఉంటుంది.సిబిల్ స్కోర్ 750 కంటే తక్కువ ఉన్నవారికి గరిష్ట వడ్డీ రేటు వర్తించవచ్చు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: టాయిలెట్‌లు దొరకడం కూడా కష్టమవుతుంది.. నెలసరి సమస్యలపై కంగనా సంచలన కామెంట్స్
ఇది వారి EMI భారాన్ని పెంచుతుంది.ఇప్పటికే ఎస్బీఐ నుంచి హోమ్ లోన్ తీసుకున్న పాత కస్టమర్లపై ఈ పెంపు ప్రభావం ఉండదు. ఈ మార్పు కేవలం ఆగస్టు 1, 2025 నుండి కొత్తగా లోన్ తీసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎస్బీఐ బాటలోనే ఇతర ప్రభుత్వ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.