Saudi Arabia: సౌదీ అరేబియా దేశంలో ఇటీవల జరిగిన ఘోర బస్సు దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికసాయం మంజూరు చేసింది. ఈ దుర్ఘటనలో 42 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన యాత్రికుల బృందం కూడా ఉన్నది. మక్కా నుంచి మదీనాకు వారంతా బస్సులో ప్రయాణిస్తుండగా, డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగి బస్సుకు అంటుకోవడంతో యాత్రికులు సజీవదహనమయ్యారు.
Saudi Arabia: ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రూ.3 కోట్ల నష్టపరిమారాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరణించిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.1 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం ఆనాడే నిర్ణయించించింది. ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీఅయ్యాయి.

