Sathi Leelavathi

Sathi Leelavathi: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో ‘సతీ లీలావతి’ టీజర్ విడుదల

Sathi Leelavathi: లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు.

భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించిన ఫ‌న్నీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సతీ లీలావతి’. మంగళవారం రోజున మేకర్స్ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే లావణ్య, దేవ్ మోహన్ జంట పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటుంది.

కానీ నెక్ట్స్ సీన్‌లోనే దేవ్ మోహన్‌ను లావణ్య కొట్టి కట్టేసుంటుంది. వారి మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో మనం గమనించవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య జరిగే గొడవలో వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, జాఫర్, మొట్ట రాజేంద్రన్ ఎందకు ఇన్ వాల్వ్ అయ్యారు. అసలు గొడవేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు దర్శక నిర్మాతలు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మేక‌ర్స్ సినిమాను శ‌ర‌వేగంగా పూర్తి చేసి సినిమాను విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Also Read: Priyanka Mohan: ప్రియాంక అరుళ్ మోహన్‌పై కుట్ర.. కెరీర్‌కు బ్రేకులు?

ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు.

న‌టీన‌టులు : లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహ‌న్‌, వి.కె.నరేష్, వి.టి.వి.గణేష్, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్, జాఫర్ సాదిక్, జోషి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
స‌మ‌ర్ప‌ణ‌: ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌
బ్యాన‌ర్స్‌: దుర్గాదేవి పిక్చ‌ర్స్
నిర్మాత‌: నాగ మోహ‌న్
ద‌ర్శ‌క‌త్వం: తాతినేని స‌త్య‌
సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: బినేంద్ర మీన‌న్‌
మాట‌లు: ఉద‌య్ పొట్టిపాడు
ఆర్ట్‌: కోసనం విఠల్
ఎడిట‌ర్‌: స‌తీష్ సూర్య‌
పి.ఆర్.ఒ: మోహ‌న్ తుమ్మ‌ల‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Thalapathy Vijay: దళపతి విజయ్ సొంత టీవీ ఛానెల్..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *