Hyderabad

Hyderabad: వీళ్ల నెట్‌వర్క్ చూసి పోలీసులే షాక్…

Hyderabad: కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ దొంగతనానికి అనర్హం అని రుజువు చేస్తున్నారు చీరల దొంగలు. ఒకరిద్దరు కాదు.. ఒక పెద్ద ముఠాగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కో నగరం అన్నట్లుగా చీలిపోతారు. పెద్ద నగరాలకైతే ఐదు లేదా ఆరు మంది వెళ్తారు. రద్దీగా ఉండే షాపులు.. పనివాళ్లు తక్కువగా ఉండే షాపులు, మాల్స్.. ఇలా ఏదైనా పర్లేదు. షాప్ ఓనర్ ను డైవర్ట్ చేసి సింపుల్ గా చీరలు కొట్టేస్తారు. చీరల కోసం ముఠా ఏంట్రా బాబు అనుకుంటే పొరపాటే. ఇది వాళ్లకు ఒక ప్రొఫెషనల్ వర్క్. చీరలతోనే వ్యాపారం, సంపాదన.. మియాపూర్ లో చీరలు దోంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేయడంతో ఈ ముఠా గుట్టు బయటపడింది.

ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ జిల్లా కు చెందిన యాబై నుంచి అరవై మంది ఒక గ్యాంగ్ గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా శారీ దోంగతనాలే జీవనాధారంగా పెట్టుకున్నారు. ఈ గ్యాంగ్ సభ్యులుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక నగరం ఎంచుకొని అక్కడ దొంగతనాలకు పాల్పడుతారు. ఈ గ్యాంగ్ నగరంలో ఒక బట్టల షాపును ఎన్నుకుని చోరీలకు దిగుతుంటారు. ఈముఠా సభ్యులు ఒక్కొక్కరిపై పది నుంచి పదిహేను కేసులు ఉన్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Also Read: Uttar Pradesh: వారం రోజుల్లో కూతురి పెళ్లి..అల్లుడితో అత్త జంప్…

వీళ్లు ముందుగా ఒకరోజు ముందు షాపులను రెక్కీ నిర్వహిస్తారు. షాపులోకి చొరబడి అక్కడి యజమాని, పని సిబ్బందికి మాయ మాటలు చెప్పి అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. ఖరీదైన చీరలు ప్యాక్ చేసి కళ్లుగప్పి డౌట్ రాకుండా బయటకు వచ్చేస్తారు.

గత కొన్నాళ్లుగా చీరలను దొంగిలిస్తున్న ముఠాపై హైదరాబాద్ లోని మియాపూర్, KPHB, మధురా నగర్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఏడు మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *