Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం.. ఈ సంక్రాంతికి వచ్చి ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని ఓటిటి కంటే ముందే టీవిలో టెలికాస్ట్ కి చేయబోతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రంని జీతెలుగు ఛానెల్ వారు ప్రసారానికి తీసుకురానున్నారు.
Also Read: Puducherry: కాజల్, తమన్నాకు షాక్.. ఓ కేసులో విచారించనున్న పోలీసులు
Sankranthiki Vasthunam: మరి థియేటర్స్ లో రిలీజ్ కి ముందు అనీల్ ఎలాంటి ప్రమోషన్స్ ని చేసి సినిమాపై హైప్ ని తీసుకొచ్చారో ఇపుడు టెలివిజన్ ప్రీమియర్ కి కూడా ఇదే జోరులో ప్రమోషన్స్ చేస్తుండడం విశేషం. ఇప్పటికే లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోమోలు కూడా వెంకీ మామ, అనీల్ నుంచి వస్తున్నాయి. మరి ఇవి కూడా వర్కౌట్ అయ్యి స్మాల్ స్క్రీన్ పై ఈ సినిమా రికార్డు టీఆర్పీని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. ఇక ఈ సినిమా మార్చ్ 1 సాయంత్రం 6 గంటలకి జీతెలుగులో ప్రసారం కాబోతుంది.