Sanju Samson: జోహానెస్బర్గ్ లో టీమిండియా సిక్సర్ల వర్షంలో క్రికెట్ ప్రేమికులందరూ తడిసి ముద్దయ్యారు. ఒక్క అభిమాని మాత్రం బాధతో కంటతడి పెట్టింది. దక్షిణాఫ్రిపై గడ్డపై సంజూ శాంసన్ రెచ్చిపోతున్న క్రమంలో అతను సంధించిన ఓ సిక్సర్ ఓ క్రికెట్ ప్రేమికురాలి చెంపను ముద్దాడింది. తోటి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్న ఆమె… బంతి తనపైకే వస్తున్న విషయాన్ని గమనించలేకపోయింది. బంతి బలంగా తాకడంతో విలవిల్లాడింది. బాధ తట్టుకోలేక ఆమె బోరున విలపించడంతో సంజూ సైతం బిక్కమొకం వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Wishing a quick recovery for the injured fan! 🤕🤞
Keep watching the 4th #SAvIND T20I LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 👈#JioCinemaSports pic.twitter.com/KMtBnOa1Hj
— JioCinema (@JioCinema) November 15, 2024