Pro Kabaddi 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. సీజన్ ఆరంభం నుంచి పట్నా జట్టు దూకుడు నిలకడగా కొనసాగిస్తోంది. బెంగాల్ వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో 52-31 పాయింట్ల తేడాతో అనాయాస విజయం సాధించింది. పట్నా తరపున దేవాంక్ 15 పాయింట్లు, ఆర్యన్ 11 పాయింట్లతో అదరగొట్టారు. జట్టుకు ఘన విజయాన్ని కట్టబెట్టారు. కాగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ 11 పాయింట్లతో రాణించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్‌పాంథర్స్ 32-24తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపు సాధించింది.
ఇది కూడా చదవండి:Tata Steel Chess 2024: టాటా స్టీల్ చెస్ విజేత కార్ల్సన్