Hyderabad: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టైపింగ్ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. మరో బీఆర్ఎస్ నేతకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు.
మొన్నటిదాకా పోలీసుల పేర్లు బయటికి రావడమే కాకా ప్రస్తుతం టిఆర్ఎస్ హయాంలోని మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి సంబంధించిన క్రియాశీలక వ్యక్తుల పేర్లు సైతం బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఇద్దరు బీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు వచ్చాయి.మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం, ఆ వెంటనే మరో మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడం, ఇవాళ ఆయన కూడా విచారణకు హాజరు కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలా ఉండగా.. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా, రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ చర్చ జోరందుకుంది.