Sanju Samson: భారత క్రికెటర్ సంజు శాంసన్ ఆసియా కప్‌కు సిద్ధమవుతూ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచారు. కేరళ క్రికెట్ లీగ్ (KCL) లో భాగంగా తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ లో ఓపెనర్‌గా బరిలోకి దిగి కేవలం 42 బంతుల్లోనే మెరుపు సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్ కొచ్చి బ్లూ టైగర్స్, ఏరీస్ కొల్లాం సెయిలర్స్ మధ్య జరిగింది. సంజు కొచ్చి జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో శాంసన్ దాదాపు 10 భారీ సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. ఈ సెంచరీతో సంజు శాంసన్ ఆసియా కప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్‌గా, అలాగే మిడిల్ ఆర్డర్‌లో కూడా రాణించగల సత్తా తనలో ఉందని సెలెక్టర్లకు ఒక స్పష్టమైన సంకేతం పంపాడు. ఈ సెంచరీ, టీ20 ఫార్మాట్‌లో సంజుకు ఇది రెండో వేగవంతమైన సెంచరీ. గతంలో అతను బంగ్లాదేశ్ పై 40 బంతుల్లో సెంచరీ సాధించాడు. సంజు ఓపెనర్‌గా బరిలోకి దిగి ఈ ప్రదర్శన చేశాడు. గతంలో కొన్ని మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్‌లో ఆడిన శాంసన్, ఈ సెంచరీతో ఆసియా కప్‌లో ఓపెనింగ్ స్థానానికి తన వాదనను బలోపేతం చేసుకున్నాడు.
Also Read: Wasim Akram: భారత్, పాక్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే చూడాలని ఉంది: వసీమ్ అక్రమ్
ఆసియా కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌కు ముందు ఇలాంటి ప్రదర్శన ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతుంది. ఓపెనర్‌గా ఇలాంటి మెరుపు ప్రదర్శన చేయడం ద్వారా జట్టు కూర్పులో తన పాత్ర ఏమిటనే దానిపై సెలెక్టర్లకు స్పష్టతనిచ్చాడు.సంజు శాంసన్ తన సహజమైన ఆటను ఆడుతూ భారీ షాట్లు కొట్టగలనని నిరూపించుకున్నాడు, ఇది టీ20 ఫార్మాట్‌కు చాలా అవసరం. ఈ మెరుపు సెంచరీతో సంజు శాంసన్ ఆసియా కప్, అలాగే రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ మంచి ప్రదర్శన చేయగలడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

