Sanjiv Goenka: క్రికెట్ అంటే ఏమిటో.. ప్లేయర్ల పట్ల ఎలా నడుచుకోవాలో కొంతమంది కార్పొరేట్లకు అర్థం కాదన్నది నిజం. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా ఇందుకు అతిపెద్ద ఎగ్జాంపుల్. ఆటలో గెలుపు ఓటములు సహజమే అయినా..ప్లేయర్లను ఉద్యోగస్తుల్లా చూస్తూ నోరు పారేసుకోవడమే కాదు.. రిటెన్షన్ సందర్భంగా గోయెంకా మాటలతో అతనిపై భారీగా ట్రోలింగ్ జరిగింది.
Sanjiv Goenka: ఐపీఎల్ రిటెన్షన్లపై ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గొయెంకా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఐపీఎల్ 2025లో రిటెన్షన్ జాబితాలో చోటుదక్కని పెద్ద స్టార్లలో కేఎల్ ఒకడు. దీంతో సూపర్ జెయింట్స్ యాజమాన్యం నిర్ణయంపై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ మొదలైంది. లక్నో టీమ్ నికోలస్ పూరన్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మొహసిన్ ఖాన్ వంటివారిని జట్టులో కొనసాగించింది. ఐపీఎల్ రిటెన్షన్లకు ముందు ఆటగాళ్ల ఎంపికలో గెలవాలన్న లక్ష్యంతో ఉన్నవారిని, వ్యక్తిగత లక్ష్యాలకు దూరంగా జట్టు విజయం కోసం శ్రమించేవారికే ప్రాధాన్యమిచ్చి ఎంపిక చేశామన్న ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గొయెంకా మాట్లాడడంతో అతనిపై భారీగా ట్రోలింగ్ నడిచింది. వ్యక్తిగత లక్ష్యాలు అంటూ సంజీవ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: South Africa: సూర్య సేనను ఢీకొట్టే సఫారీ జట్టు ఇదే
Sanjiv Goenka: ఇది కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించి చేసినవే అని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై భారత మాజీ ఆటగాడు దొడ్డా గణేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాడు. కేఎల్ రాహుల్ నిస్వార్థంగా జట్టు కోసం ఆడే ఆటగాడు. అతడిని మాత్రం వదిలేశారు పలువురు నెటిజన్లు గొయోంకా వ్యాఖ్యలను తప్పుబట్టారు. గత ఐపీఎల్‌లో హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం సంజీవ్-కేఎల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది కాస్తా లైవ్‌లో ప్రసారమైంది. ఆ తర్వాత ఇది వైరల్ కావడంతో చాలామంది గొయెంకా తీరును తప్పుపట్టారు. కెప్టెన్‌తో మైదానంలో వాదనకు దిగడం సరికాదని పేర్కొన్నారు. ఆ తర్వాత గొయెంకా కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.