Tirupati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో దారుణం చోటుచేసుకున్నది. అభం శుభం తెలియని ఓ చిన్నారి జీవితాన్ని ఓ కామాంధుడు చిదిమేశాడు. బంధువే కదా అని పిలిస్తే వెళ్లిన ఆ పసిపాపపై లైంగికదాడికి పాల్పడి, దారుణంగా చంపేశాడు. చట్టాలు ఎన్ని వస్తున్నా ఇలాంటి దుర్మార్గులు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఆ దుండగుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు.
Tirupati: తిరుపతి వడమాటపేట మండలంలో మూడున్నరేండ్ల బాలికకు బంధువైన సుశాంత్ చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లిన ఆ దుర్మార్గుడు చిన్నారిపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆపై ఆ బాలికను చంపేసి అక్కడే పూడ్చి పెట్టాడు. అనుమానంతో నిందితుడు సుశాంత్‌ను విచారించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
Tirupati: చిన్నారి లైంగికదాడి, హత్య విషయం తెలిసిన స్థానికులు, చిన్నారి బంధువులు రోడ్డుపైకి వచ్చి దుండగుడిపై శాపనార్థాలు పెట్టారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఊరి శిక్షే సరి అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటన మరో ఇంటిలో జరగకుండా ఉండాలంటే కఠిన శిక్ష అమలు చేయాల్సిందేనని పోలీసులను డిమాండ్ చేశారు.