Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రోహిత్ డైరెక్ట్ చేస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తున్నాడు.ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ సంజయ్ దత్‌కు ఈ సినిమా కథను వినిపించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.సంజయ్ దత్ తెలుగులో రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో నటించగా, ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. మరి నిజంగానే సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ మూవీలో సంజయ్ దత్ నటిస్తాడా అనేది చూడాలి.

