ఖుషీ సినిమాతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ప్రేక్షకులను అలరించిన సమంత.. తెలుగులో మరో సినిమా ప్రకటించలేదు. అయితే, ప్రస్తుతం సామ్ బాలీవుడ్ లో బాగా బిజీగా ఉంది. అక్కడ పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తోంది.దీంతో సామ్ తెలుగు ఫ్యాన్స్ ఆమె కొత్త సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ ఆనందపడే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె తెలుగులో ఓ క్రేజీ సినిమాతో రాబోతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ కు జోడీగా మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ తరువాత దర్శకుడు సుకుమార్ తో ఓ సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ కాంబోలో ఇప్పటికే వచ్చిన రంగస్థలం భారీ విజయం సాదించిన నేపధ్యంలో కొత్త సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
ఈ నేపధ్యంలోనే తాజాగా రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేశారట మేకర్స్. రంగస్థలం సినిమా కోసం కూడా రామ్ చరణ్-సుకుమార్-సమంత కలిసి పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ అదే హిట్ కాంబోను రిపీట్ చేస్తన్నాడట సుకుమార్. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ కాంబో గనక సెట్ అయ్యింది అంటే మరో ఇండస్ట్రీ హిట్ కన్ఫర్మ్ గా చెప్పుకొచ్చు.