Samantha: నాగచైతన్య, శోభిత ధూళిపాల వివాహం జరిగిన దగ్గర నుండి సమంత స్పందన కోసం చాలామంది ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. సమంత సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా… దానిని నాగచైతన్య వైవాహిక జీవితానికి లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిని తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఒకటి భలే ఆకర్షించింది. ఇన్ స్టాగ్రామ్ లో సమంత తన పెట్ డాగ్ సాషాతో ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ‘దానంత ప్రేమను ఎవరూ అందించలేరు’ అన్నట్టుగా ఓ కాప్షన్ పెట్టింది. ఈ వ్యాఖ్యలను పరోక్షంగా కుక్క ప్రేమే గొప్పదంటున్న సమంత ఉద్దేశిస్తూ సమంత పెట్టిందనే ప్రచారాన్ని నెటిజన్స్ మొదలు పెట్టారు. నిజానికి మొదటి నుండి సమంత పెట్ డాగ్స్ లవ్వరే! ఎప్పడూ వాటి ఫోటోస్ ను పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ పోస్ట్ తో పాటు మరి కొన్ని పోస్ట్ లనూ పెట్టింది. కానీ వాటి గురించి పట్టించుకోకుండా దీనిని మాత్రమే హైలైట్ చేస్తూ… నాగచైతన్య మీద సమంతకు ఉన్న హేట్ ఇదంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.