Mega 158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘Mega 158’. ఇటీవలనే ఈ భారీ చిత్రం గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ శరవేగంగా ముగించుకుని, రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో.. మరోసారి రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి.
సెకండాఫ్ ట్విస్ట్.. నారా రోహిత్ ఎంట్రీ!
ఈ సినిమాకు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో వచ్చే ఒక కీలక పాత్ర కోసం టాలీవుడ్ విలక్షణ నటుడు, యంగ్ హీరో నారా రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో కథను మలుపు తిప్పే ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం దర్శకుడు బాబీ పలువురు హీరోల పేర్లను అనుకున్నప్పటికీ.. చివరకు నారా రోహిత్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే, బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు చిరంజీవి-నారా రోహిత్ ల విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త హంగామా సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్.. టాప్ టెక్నీషియన్స్
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ బడా నిర్మాణ సంస్థ ‘KVN ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి ప్రియమణి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. మలయాళ యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్, చిరంజీవి కూతురి పాత్రలో కనిపించనుందని టాక్.
