Samantha: సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కించిన ‘శుభం’ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిన్న చిత్రం ఇప్పటికే రూ.3 కోట్ల లాభాలను రాబట్టినట్లు సమాచారం. సాధారణంగా చిన్న సినిమాల డిస్ట్రిబ్యూషన్‌కు బడా సంస్థలు ఆసక్తి చూపవు.
కానీ, సమంత కోసం మైత్రీ మూవీ మేకర్స్ నైజాం డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకుని, రూ.1.5 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఉత్తరాంధ్ర, సీడెడ్ ఏరియాల్లో ‘శుభం’ డిస్ట్రిబ్యూషన్‌ను స్వయంగా నిర్వహిస్తున్నారు.
Also Read: SSMB29: గ్రాండ్ సాంగ్ షూట్, ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్!
ఈ బడా నిర్మాణ సంస్థల మద్దతుతో సమంతకు నమ్మకం పెరిగింది. సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడుతోంది. ‘శుభం’ హిట్ అయితే, సమంత చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణంలో మరిన్ని ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విజయం సమంత నిర్మాతగా స్థిరపడేందుకు బలమైన మైలురాయిగా నిలవనుంది.
శుభం అధికారిక ట్రైలర్ :

