టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచారు. తాజాగా, దీపావళి పండుగను ఓ ప్రత్యేకమైన ప్రదేశంలో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేసింది. ‘‘మనకు మనశ్శాంతిని ఇచ్చి, పర్సనల్‌గా మెరుగుపరిచి, ప్రేమ, గౌరవం అందే చోట ఉంటే రోజూ పండగలాగా ఉంటుంది’’ అంటూ రాసుకొచ్చింది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వరాకు వెళ్లిన సామ్ దీపాలు వెలిగిస్తూ దేవుడికి పూజ చేస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సమంత క్రిష్టియన్ అయినా కూడా హిందూ మతాన్ని నమ్ముతూ దేవాలయాలకు వెళ్తూ పూజలు చేస్తుండటంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కాగా, విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఖుషీ సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమా చేయలేదు.అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సామ్ ముంబైలోనే ఎక్కువగా ఉంటోంది. ఆమె నటించిన మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్ తో కలిసి నటించిన ఈ క్రేజీ సిరీస్ నంవబర్ 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సమంత వరుస పోస్టులు పెడుతోంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ కు వెళ్లిన సామ్..అక్కడే దీపావళి వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.