Samantha: సమంత నటించిన వెబ్ సీరీస్ ‘’సిటాడెల్” హాని బన్నీ’ ఇటీవల స్ర్టీమింగ్ కి వచ్చింది. రాజ్ డికె దర్శకత్వంలో రూపొందిన ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో వీక్షకుల మన్ననలు పొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సమంత సీరీస్ కావటంతో ఫ్యాన్స్ ఖుషీ అయిపోయారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సీరీస్ కోసం స్ట్రీమింగ్ కు ముందు సమంత, వరుణ్ వరుసగా మీడియాతో సమావేశం అయ్యారు. ఇక ప్రసారం తర్వాత కూడా రెస్పాన్స్ పై ముచ్చడించారు. ఇటీవల మీడియా చిట్ చాట్ లో వరుణ్ ధావన్ సీక్వెల్ గురించి తెలియచేశాడు.
ఇది కూడా చదవండి: Miss You Teaser: విడుదలైన సిద్ధార్థ్ ‘మిస్ యు’ టీజర్
Samantha: ‘సిటాడెల్2’ ఉంటుందని నెటిజన్స్ కి చెబుతూ అది మేకర్స్ వర్కవుట్ చేస్తున్నారన్నారు. అంతే కాదు సీక్వెల్ ను వెబ్ సీరీస్ గా కాకుండా సినిమాగా తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. అదే నిజం అయితే ఓ రకంగా ప్రయోగమే అవుతుంది. ఎందుకంటే సీరీస్ కి సీక్వెల్స్ ఉంటాయి కానీ ఓ వెబ్ సీరీస్ సీక్వెల్ ను సినిమాగా తీయటం అంటే ఎక్స్ పరిమెంట్ అనే అనుకోవాలి. అటు వరుణ్ ధావన్, ఇటు సమంత సినిమాలతో బిజీ గా ఉన్నారు. మరి వీరిద్దరితో ‘సిటాడెల్’ సీక్వెల్ సినిమాగానూ వచ్చి ఆకట్టుకుంటుందేమో చూడాలి.