P. Susheela: జాతీయ స్థాయిలో సినిమా అవార్డులు నెలకొల్పిన దాదాపు 18 ఏళ్ళకు నేషనల్ అవార్డ్స్ లో ‘బెస్ట్ సింగర్’ అవార్డును ప్రవేశ పెట్టారు. ఈ అవార్డును అందుకున్న తొలి గాయనిగా మన తెలుగు కోకిల పి.సుశీలమ్మ చరిత్రలో నిలిచారు. అయితే 1969లో రూపొందిన తమిళ చిత్రం ‘ఉయర్ద మనిదన్’ ద్వారా “నాలై ఇంద వేళై పార్తు…” అనే పాటతో సుశీలమ్మ బెస్ట్ సింగర్ గా ఫస్ట్ నేషనల్ అవార్డును అందుకున్నారు. తరువాత ఆమెకు మరో నాలుగు సార్లు జాతీయ అవార్డు లభించింది. మొత్తం ఐదుసార్లు నేషనల్ అవార్డు అందుకున్న సుశీల మరెన్నో అవార్డులూ, రివార్డులూ పొందారు.
ఇది కూడా చదవండి: Samantha: సినిమాగా సమంత ‘సిటాడెల్’ సీక్వెల్!
P. Susheela: తన కెరీర్ లో మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ తదితర భాషలలో మొత్తం 17, 695 పాటలు పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్’లో చోటు సంపాదించారు. 2004లో రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారామె. 2008లో కేంద్రప్రభుత్వం సుశీలకు పద్మభూషణ్ ప్రదానం చేసింది. ఇంతలా కీర్తి గడించిన పి.సుశీలమ్మ నవంబర్ 13వ తేదీన 89 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. అందువల్ల సుశీలమ్మ అభిమానులు ఆమె గళంలో జాలువారిన మధురామృతాన్ని మననం చేసుకొని పరవశించిపోవడం ఖాయం!