Samantha: ఓర్మాక్స్ మీడియా జూన్ 2025 నాటి స్టార్స్ ఇండియా లవ్స్ రిపోర్ట్ ప్రకారం, భారత సినిమా నటీమణుల జనాదరణ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ జాబితాలో సౌత్ ఇండియన్ నటీమణులు మరోసారి ఆధిపత్యం చెలాయించారు. సమంతా వరుసగా పలు నెలలుగా మొదటి స్థానంలో కొనసాగుతూ అభిమానులను ఆకర్షిస్తోంది. ఆమె వెనుకే ఆలియా భట్, దీపికా పదుకొణెలు ఉన్నారు. నయనతార, త్రిష కృష్ణన్, రష్మిక మందన్న వంటి సౌత్ నటీమణులు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
Also Read: Indian Box Office: ఇండియన్ బాక్స్ ఆఫీస్ 2025: ఇప్పటిదాకా ఎన్ని కోట్ల లాభమంటే?
బాలీవుడ్ నుంచి కియారా అద్వానీ, కత్రినా కైఫ్‌లు కూడా జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ర్యాంకింగ్స్‌లో సినిమా విజయాలు, అభిమానుల ఆదరణ, సోషల్ మీడియా ప్రభావం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ జాబితా దేశవ్యాప్తంగా 10,000 మంది ప్రేక్షకుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందింది.