Sama Rammohan Reddy: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ కానున్నాయి. ఈ నెల 29న వారి గడువు ముగుస్తుంది. ఈ మేరకు ఈ నెల 20న పోలింగ్ జరగనున్నది. ఈ ఐదు స్థానాల్లో ఒక స్థానం బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీకి నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ నాలుగింటిలో తీవ్రమైన పోటీ నెలకొనగా, కాంగ్రెస్ వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్న సామ రామ్మోహన్‌రెడ్డికి ఖారారైనట్టుగా సమాచారం అందుతున్నది.
Sama Rammohan Reddy: టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ అయిన సామ రామ్మోహన్‌రెడ్డి వివిధ వేదికల్లో, సోషల్ మీడియా వేదికలపైనా కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని వినిపించడంలో ముందున్నారని అనడానికి అతిశయోక్తి లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు, ఇప్పుడు అధికారంలో ఉన్నా పార్టీ కోసం ఆయన విశేష కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.
Sama Rammohan Reddy: గతంలో కాంగ్రెస్ కోలుకోలేకుండా ఉన్న సమయంలో పార్టీని నిలబెట్టేందుకు యువకుడైన సామ రామ్మోహన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని ఆ పార్టీ ముఖ్య నేతలే మెచ్చుకుంటారు. తన వాక్చాతుర్యంతో, పదునైన ప్రశ్నలతో ఆనాడు అధికార బీఆర్ఎస్‌ను, ఈ నాడు ప్రతిపక్ష పార్టీల నేతలను ఇరుకున పెడుతూ కాంగ్రెస్‌కు ఆశావహ దృక్పథాన్ని కల్పిస్తూ వస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకోవడంలో ఇతర నేతలతోపాటు సామ రామ్మోహన్‌రెడ్డి పాత్ర కూడా గణనీయంగా ఉన్నది.
Sama Rammohan Reddy: సామ రామ్మోహన్‌రెడ్డి సామాన్య కార్యకర్త స్థాయి నుంచి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌గా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగారు. ఆయన అడ్వకేట్‌గా, మీడియా స్పోక్స్ పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలా సేవలందిస్తూ వస్తున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన అధిష్టానం ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ సీటును సామకే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. యువనేతగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వచ్చిన సామకు ఎమ్మల్సీ పదవి ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
Sama Rammohan Reddy: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. యువనేతలకు అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ మరింత బలపడే అవకాశం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగానే రాష్ట్రంలోనూ యువ నేతలను పార్టీ ప్రోత్సహిస్తున్నది. దీనిలో భాగంగానే యువ నేతల్లో ముందు వరుసలో ఉన్న సామ రామ్మోహన్‌రెడ్డికే ఆ ప్రాధాన్యం దక్కుతుందని కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆశాభావం ఉన్నది.
Sama Rammohan Reddy: ఈ మేరకు టీపీసీసీ ఫైవ్‌మెన్ కమిటీలో కూడా సామ రామ్మోహన్‌రెడ్డికి ఒక ఎమ్మెల్సీ సీటు ఖరారు అయిందని, ఏఐసీసీ ఆమోదం కోసం పంపిన ప్రతిపాదన జాబితాలో సామ పేరు ఉన్నదని, సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా సామ వైపే మొగ్గుచూపారని తెలిసింది. నేడో, రేపో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్న ఈ దశలో సామ రామ్మోహన్‌రెడ్డికి సీటు ఖరారవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.