IPL 2025: క్రికెట్ ప్రేమికులకు పండగే! ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈసారి ప్రారంభోత్సవం కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది. 13 వేదికల్లో ప్రారంభోత్సవాలు జరగనుండటం విశేషం.
స్టార్ సెలబ్రిటీలతో సందడి:
ఈ వేడుకలకు స్టార్ సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించనున్నారు. దిశా పటాని, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ అందాల విందు చేయనున్నారు. శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్, పంజాబ్ మ్యూజిక్ సెన్సేషన్ కరణ్ ఔజ్లా తమ గానంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ప్రముఖ క్రికెటర్లు, ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ వేడుకలకు హాజరుకానున్నారు.
ధూమ్ ధామ్ పోరు:
ప్రారంభోత్సవం అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. 65 రోజుల పాటు 10 జట్లు 74 మ్యాచ్‌లలో తలపడనున్నాయి. ఇందులో 12 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఐదేసి సార్లు టైటిల్ గెలుచుకోగా, కేకేఆర్ మూడు సార్లు విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఖాతాలో రెండు ఐపీఎల్ టైటిళ్లు ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్ టైటాన్స్ చెరోసారి టైటిల్ దక్కించుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు తొలి టైటిల్ కోసం ఆరాటపడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Virat Kholi: తలతిక్క రూల్స్.. కోహ్లీ దెబ్బకు వెనక్కి తగ్గిన BCCI
సన్‌రైజర్స్ తొలి మ్యాచ్:
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న సొంతగడ్డపై రాజస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 18 విశేషాలు:
మార్చి 22 నుంచి మే 25 వరకు మ్యాచ్‌లు
13 వేదికల్లో మ్యాచ్‌లు
65 రోజులు, 74 మ్యాచ్‌లు, 12 డబుల్ హెడర్స్
స్టార్ సెలబ్రిటీల సందడి
క్రికెట్ ప్రేమికులకు పండగ వాతావరణం

