VC.Sajjanar

VC.Sajjanar: ఎంజీబీఎస్‌కు రావొద్దు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లివి!

VC.Sajjanar: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మూసీ నది పొంగిపొర్లి ఎంజీబీఎస్ (MGBS) ప్రాంగ‌ణంలోకి వరదనీరు చేరింది. దీంతో అక్కడి నుంచి బస్సుల రాకపోకలను ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రయాణికులకు సూచనలు జారీ చేశారు. ఆయన ‘ఎక్స్‌’ వేదికగా చేసిన పోస్ట్‌లో, “వరద పరిస్థితులు మెరుగుపడే వరకు ఎంజీబీఎస్‌కి ఎవరూ రాకండి. అవసరమైన అన్ని బోర్డింగ్ ఏర్పాట్లు నగరంలోని ఇతర ప్రదేశాల్లో చేశాం” అని తెలిపారు.

బస్సుల ప్రత్యామ్నాయ బోర్డింగ్ పాయింట్లు

  • ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ వైపు సర్వీసులు – జేబీఎస్‌ (JBS) నుంచి

  • వరంగల్‌, హనుమకొండ వైపు సర్వీసులు – ఉప్పల్‌ క్రాస్ రోడ్స్ నుంచి

  • సూర్యాపేట‌, న‌ల్గొండ‌, విజయవాడ వైపు సర్వీసులు – ఎల్బీనగర్ నుంచి

  • మహబూబ్‌నగర్‌, కర్నూలు, బెంగళూరు వైపు సర్వీసులు – ఆరాంఘర్ నుంచి

ఇది కూడా చదవండి: VC Sajjanar: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్‌.. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

అదనపు సౌకర్యాలు

సజ్జనార్‌ తెలిపారు: “ఎంజీబీఎస్‌కు పొరపాటున వచ్చే ప్రయాణికుల కోసం లోకల్ బస్సులు సిద్ధంగా ఉన్నాయి. వారిని ఆయా కొత్త బోర్డింగ్ పాయింట్లకు తరలిస్తాం. వర్షాలు, వరద తగ్గేవరకు ఎంజీబీఎస్‌కు ఎవరూ రావొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *