Sailesh Kolanu: టాలీవుడ్‌లో ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హిట్ 3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు శైలేష్ కొలను తన ‘హిట్’ ఫ్రాంచైజీలో మూడో భాగంగా నాచురల్ స్టార్ నానితో ఈ సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ బాక్సాఫీస్ వద్ద గ్యారెంటీ హిట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అయితే, ఈ సినిమాతో స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు లింక్ ఉందనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
శైలేష్ కొలను తన తదుపరి ప్రాజెక్ట్ కోసం నాగార్జునకు ఓ కథ వినిపించినట్లు సమాచారం. కథ నచ్చిన నాగ్, ‘హిట్ 3’ విజయాన్ని బట్టి తన నిర్ణయాన్ని తెలియజేయనున్నాడు. నాని కూడా ఈ సినిమాపై గట్టి కాన్ఫిడెన్స్‌తో ఉండటంతో నాగ్ శైలేష్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమని టాక్. అభిమానులు ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘హిట్ 3’ విజయం నాగ్-శైలేష్ సినిమాకు దారి తీస్తుందా? వేచి చూడాలి!