Saikrishna Custodial Death: విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన యువకుడు సాయికృష్ణ కస్టోడియల్ డెత్ (లాకప్ డెత్) కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) నాగరాజుకు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనల ప్రకారం తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న ‘డిఫాల్ట్ బెయిల్’ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
కోర్టులో తాజా పరిణామాలు..
పోలీస్ కస్టడీలో సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో అధికారులు సీఐ నాగరాజును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆయన గత 95 రోజులుగా రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కొనసాగుతున్నారు. కస్టోడియల్ డెత్ కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులకు బెయిల్ ఇచ్చే విషయంలో న్యాయస్థానాలు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తీర్పుతో స్పష్టమవుతోంది.
