KTR

KTR: ‘ది ప్యారడైజ్’ చూసేందుకు థియేటర్‌కు కేటీఆర్..!

KTR: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా  ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ప్రీమియర్ల సమయంలో తొలుత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, రెండో ఆట (సెకండ్ షో) నుంచి ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో థియేటర్లలో సందడి భారీగా పెరిగింది. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి  ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో కలెక్షన్లు జోరందుకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సినిమాపై చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

థియేటర్‌లో సినిమా చూడబోతున్న కేటీఆర్..

చాలా ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తాను నేరుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడబోతున్నట్లు కేటీఆర్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా వేదికగా ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాని ఈ రాత్రి థియేటర్‌లో చూడబోతున్నానని పేర్కొన్నారు.

సినిమా ఘన విజయం సాధిస్తున్న సందర్భంగా ‘ది ప్యారడైజ్’ యూనిట్ మొత్తానికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌తో నాని అభిమానులు, సినీ ప్రేమికులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ktr
థియేటర్లలో రచ్చ లేపుతున్న ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధారంగా రూపొందించిన ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.

 

వెండితెరపై శంకరన్న ఎంట్రీ ఇచ్చినప్పుడు, ఆ పాత్ర చెప్పే డైలాగులకు ప్రేక్షకులు థియేటర్లలో ఈలలు, చప్పట్లతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తొలుత నెగెటివ్ టాక్ వినిపించినా, ప్రేక్షకుల ఆదరణ, బలమైన కంటెంట్‌తో ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టు సాధిస్తోంది. రాజకీయ ప్రముఖుడు కేటీఆర్ స్వయంగా థియేటర్‌కు వెళ్లి వీక్షించనుండటంతో సినిమాకు మరింత ప్రచారం లభించినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *