Asian Games 2026: ఆసియా క్రీడలు 2026లో భారత కబడ్డీ జట్లు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాయి. ఒకే రోజు ఇరు విభాగాల్లోనూ (పురుషులు, మహిళలు) బలమైన ప్రత్యర్థి ఇరాన్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో విజయం సాధించి భారత్‌కు రెండు బంగారు పతకాలను అందించాయి. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల ఫైనల్లో భారత్ 40-34 తేడాతో ఇరాన్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియాడ్ స్వర్ణాన్ని ముద్దాడింది. అంతకుముందు జరిగిన మహిళల ఫైనల్లోనూ భారత అమ్మాయిల జట్టు 37-34 తేడాతో ఇరాన్‌ను మట్టికరిపించి వరుసగా రెండోసారి, మొత్తంగా 4వ సారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
పురుషుల ఫైనల్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ భారత్ అద్భుత విజయం
ఆసియా క్రీడల్లో భారత పతకాల జోరు..
మారథాన్‌లో 44 ఏళ్ల తర్వాత రికార్డ్ రజతం: పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ 2:11:37 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రజత పతకం సాధించి చరిత్ర సృష్టించారు. పురుషుల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత ఇదే తొలి ఆసియాడ్ పతకం.
స్క్వాష్‌లో కాంస్యం: మిక్స్డ్ డబుల్స్ స్క్వాష్ విభాగంలో జోష్నా చిన్నప్ప – వెలవన్ సెంథిల్‌కుమార్ జోడీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఒకే రోజు ఇరాన్ జట్టును రెండు విభాగాల్లోనూ మట్టికరిపించి డబుల్ గోల్డ్ సాధించడం భారత కబడ్డీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మైలురాయిగా నిలిచింది.
