India A

India A: భారత్ – ఎ జట్టు జోరు సాయి సుదర్శన్, పడిక్కల్ నిలకడ

India A: భారత యువ ప్లేయర్లు సాయి సుదర్శన్ 96 నాటౌట్, దేవదత్ పడిక్కల్ 80 నాటౌట్ గా నిలవడంతో  ఆస్ట్రేలియా- ఎ జట్టుతో  జరుగుతున్న తొలి అనధికార టెస్టులో భారత్‌- ఎ పట్టు బిగిసింది. వీరిద్దరి జోరుతో  రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌- ఎ రెండో ఇన్నింగ్స్‌లో  2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసి విజయంపై ఆశలు పెంచుకుంది. అభేద్యమైన మూడో వికెట్‌కు ఈ జోడీ 178 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రస్తుత భారత యువ జట్టు 120 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 107 పరుగులకే కుప్పకూలగా..భారత బౌలర్లు ముకేశ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ యువజట్టు 195 పరుగులకు ఆలౌటైంది.  మరో భారత పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నాడు.

ఇది కూడా చదవండి: WI vs ENG: ఇంగ్లండ్ కు షాక్… తొలి వన్డే వెస్టిండీస్ దే

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Japan Masters 2024: ప్రిక్వార్టర్స్ లో సింధు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *