Vizianagaram: విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 4 నుండి 11 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. 12న నామినేషన్ పరిశీలించనున్నారు. ఈ నెల 14 వరకు నామినేషన్ క్యాన్సల్ చేసుకోవడానికి గడువుని ఇచ్చారు. ఈ నెల 28న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటింగ్. ఈ నోటిఫికేషన్ తో నెల రోజుల పాటు జిల్లాలో రాజకీయ వాతావరణం వుండనుంది. శుక్రవారం నుంచే జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఢిల్లీలో విడుదల చేసిన పకటనలో పేర్కొన్నారు.
