Sai Pallavi: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ హ్యాట్రిక్ సాధించారు. ‘మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్’ చిత్రాలో ఆయన మెప్పించారు. అలానే ‘కల్కి 2898 ఎ.డి.’లోనూ అతిథిపాత్రలో దుల్కర్ మెరిసారు. ఆయన హీరోగా స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంయుక్తంగా ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమాను నిర్మించబోతున్నాయి. పవన్ సాదినేని దీనికి దర్శకుడు.
ఇది కూడా చదవండి: Ravi Teja: రవితేజ బర్త్ డే కానుకగా ‘నేనింతే’ రీ-రిలీజ్!
Sai Pallavi: ఫిబ్రవరి 5 నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తొలుత సాయిపల్లవిని అనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్స్ ప్రాబ్లమ్ కారణంగా ఆమె స్థానంలో వేరొకరు రావచ్చనే మాట వినిపిస్తోంది. మరి కొద్ది రోజులలో హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ తెలిసే ఛాన్స్ ఉంది