Pawan Kalyan: విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పుస్తకాల పట్ల తన అభిమానం, ప్రాధాన్యత గురించి మాట్లాడారు. “పుస్తకాలు నా జీవితానికి ధైర్యం, జ్ఞానం అందించాయి. అవి నా జీవితానికి వెలకట్టలేని సంపద. నాదగ్గర ఉన్న పుస్తకాలను ఇతరులతో పంచుకోవడం నా స్వభావం. నా జీవితంలో పుస్తకాలు లేకపోయుంటే నేను ఏమయ్యేవాడినో తెలియదు. రెండుసార్లు ఓడిపోయినప్పటికీ, పుస్తకాలు ఇచ్చిన ధైర్యంతోనే నేను తిరిగి నిలబడ్డాను. చదువు రాకపోయినప్పటికీ, పుస్తకాల ద్వారా అనేక సబ్జెక్టులను నేర్చుకున్నాను” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.