Sabarimala Temple: శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో 41 రోజులు కఠోర దీక్ష చేసి, స్వామివారి దర్శనానికి వెళ్లిన వేలాది మంది భక్తుల ఎదుటే ఓ మాలధారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆలయం వద్ద ఉన్న ఓ ఫ్లైఓవర్ పైనుంచి ఆ భక్తుడు కిందికి దూకడంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన నెలకొన్నది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు.
Sabarimala Temple: సోమవారం రాత్రి నెయ్యాభిషేకం టికెట్ కౌంటర్ వద్ద ఫ్లైఓవర్ పైనుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాలధారుడు కుమారస్వామి (40) కిందికి దూకడంతో ఆయన కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే తోటి భక్తులు, పోలీసులు అతడిని సన్నిధానం వద్ద ఉన్న ఆసుపత్రికి తరలించగా, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కుమారస్వామి ఊపిరి విడిచినట్టు అధికారులు తెలిపారు.
Sabarimala Temple: తీవ్రగాయాలు కావడంతో కుమారస్వామికి గుండెపోటు రావడంతో చనిపోయినట్టు ఆలయ అధికారులు తెలిపారు. అయితే కుమారస్వామి మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు అతడి వెంట వచ్చిన తోటి భక్తులు తెలిపారు. ఎలాంటి సమస్యలు, ఏమిటి? అన్న వివరాలు తెలియాల్సి ఉన్నది.