Sabarimala: శబరిమల అయ్యప్పస్వామి మండల దీక్ష ఈరోజుతో ముగుస్తుంది. ఈరోజు అంటే 26.12.2024న మధ్యాహ్నం మండల పూజ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అయ్యప్పస్వామి మండల పూజకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శబరిమలైలో నిన్న సాయంత్రం అయ్యప్పన్ బంగారు వస్త్రాన్ని ధరించిన తరువాత దీపారాధన ఉత్సవం జరిగింది. ఈ దీపారాధనోత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. మండల పూజ అనంతరం ఆలయం మూసివేస్తున్న కారణంగా నడకదారులను మూసివేశారు. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజా కాలం 41 రోజుల తరువాత ఈరోజుతో ముగుస్తుంది.
Sabarimala: అయ్యప్ప స్వామి మండల పూజలో ధరించే బంగారు వస్త్రం దివంగత ట్రావెన్ కొర్ రాజు చిత్ర తిరుణాల్ మహారాజా సమర్పించారు. దీనిని ప్రతి ఏటా మండల పూజ సమయంలో అయ్యప్ప ధరిస్తారు. ఈ బంగారు వస్త్రాన్ని నిన్న గణపతి ఆలయం ముందు ప్రజల దర్శనం కోసం ఉంచారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు స్వామి బంగారు అంగీని దర్శించుకోవడం కోసం బారులు తీరారు.
ఇది కూడా చదవండి: Horoscope: మీరనుకున్నది నెరవేరుతుంది.. ఈరోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!
Sabarimala: ఇక భక్తులు అధిక సంఖ్యలో ఉండడంతో నడక దారిని గంట ఆలస్యంగా మూసివేశారు. మళ్ళీ ఈ నడక దారిని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ చేస్తారు. మండల పూజ ముగిసిన తరువాత తిరిగి రాత్రి 11 గంటలకు నడకదారిని మూసివేస్తారు. ఆ తరువాత నుంచి మకర దీప దర్శనం కోసం ఏర్పాట్లు మొదలు పెడతారు. మకర దర్శనం కోసం భక్తులను ఈనెల 30 సాయంత్రం నుంచి అనుమతిస్తారు. జనవరి 14న మకర జ్యోతి దర్శన ఉత్సవం నిర్వహిస్తారు.