Pradeep Machiraju: పాపులర్ యాంకర్, టర్డ్న్ హీరో ప్రదీప్ మాచిరాజు నటిస్తున్న సెకండ్ మూవీ ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’. దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని నితిన్, భరత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. తాజాగా క్రిస్మస్ కానుకగా ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవి పై చిత్రీకరించిన ‘టచ్ లో ఉండు…’ పాటను విడుదల చేశారు. ‘లే… లే’ తర్వాత వచ్చిన ఈ సింగిల్ ను కలర్ ఫుల్ సెట్స్ లో పిక్చరైజ్ చేశారు. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రథన్ స్వరాలు సమకూర్చారు.