Aryna Sabalenka: రియాద్ లో జరుగుతున్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో రెండో విజయంతో బెలారస్ కు చెందిన అర్యానా సబలెంకా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-ఎలో రెండో లీగ్ మ్యాచ్‌లో ఆమె 6-3, 7-5తో ఇటలీకి చెందిన జాస్మిన్ పావొలినిపై విజయం సాధించింది. మరో గ్రూప్-ఎ మ్యాచ్‌లో చైనాకు చెందిన జెంగ్ కిన్వెన్ 7-6 (7-4), 3-6, 6-1తో కజకిస్థాన్ కు చెందిన రిబకినాను ఓడించింది. ఈ టోర్నీలో ప్రపంచ టాప్-8 ర్యాంకర్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడుతున్నారు. టాప్-2లో నిలిచే ప్లేయర్లు సెమీస్ చేరుకుంటారు. కాగా, మెన్స్ విభాగంలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ గాయంతో తప్పుకున్నాడు.
