Plane Crash: రష్యాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన An-24 ప్రయాణీకుల విమానం కూలిపోవడంతో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఐదుగురు పిల్లలు సహా 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది దుర్మరణం చెందారు.
టిండా సమీపంలో విషాదం
బ్లాగోవెష్‌చెన్స్క్ నగరం నుండి బయలుదేరిన ఈ విమానం, టిండా పట్టణానికి చేరుకునే ముందు అదృశ్యమైంది. ఖబరోవ్స్క్-బ్లాగోవెష్‌చెన్స్క్-టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోయాయి. మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండో ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
పర్వత ప్రాంతంలో శిథిలాలు
రక్షక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శోధన ప్రారంభించాయి. ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి చెందిన Mi-8 రెస్క్యూ హెలికాప్టర్ పర్వత ప్రాంతంలో కాలిపోతున్న విమానం శిథిలాలను కనుగొంది. మంటల్లో మునిగిపోయిన ఫ్యూజ్‌లేజ్ వద్ద ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
కుటుంబాల్లో ఆవేదన
ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. రష్యా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
రష్యాలో ఘోర విమాన ప్రమాదం.. 49 మంది మృతి
రష్యాలో మరోసారి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణీకుల విమానం అదృశ్యమై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
విమానంలో 43 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ఐదుగురు చిన్నారులు… pic.twitter.com/TYa9GD1Wvp
— s5news (@s5newsoffical) July 24, 2025