RS Praveen Kumar: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించిన అంశాలతో మరో కోణం చర్చనీయాంశంగా మారింది.
RS Praveen Kumar: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల వద్ద 2023వ సంవత్సరం అక్టోబర్ 21న సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్ధాలు వినిపించాయని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద పనిచేసే అసిస్టెంట్ ఇంజినీర్ రవికాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఆయన ఫిర్యాదు మేరకు 2023వ సంవత్సరం అక్టోబర్ 21న మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని, దానిపై ఎందకు ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
RS Praveen Kumar: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల వద్ద జరిగిన భారీ పేలుడు వల్ల బ్యారేజీ పిల్లర్ల డ్యామేజీకి సంబంధం ఉండొచ్చని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని ఆరోపించారు. ఒక ఇంటిలో పిల్లర్లకు పగుళ్లు రావు, ఉష్ణోగ్రతలో తేడాతోనే గోడలకు పగుళ్లు వస్తాయని తెలిపారు. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కటే 20వ నంబర్ పిల్లర్‌కు క్రాక్ వచ్చిందంటే.. కచ్చితంగా పేలుడు జరిగి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
RS Praveen Kumar: అసలు ఏమాత్రం వరదలేని సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోయిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుందని అన్నారు. పేలుడు జరిగిందని ఫిర్యాదు అందగానే మహదేవ్‌పూర్ పోలీసులు ఘటనా స్థలం వద్ద పిల్లర్ల శాంపిళ్లు, భూమి శాంపిళ్లు, అక్కడ మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకొని ఉండాల్సింది అని పేర్కొన్నారు. ఇదంతా కావాలని కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్నాం చేసేందుకు కుట్రలు పన్నారని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు.