RRR: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇటీవల పులివెందులలో ఉప ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని, ఒక ఎమ్మెల్యే ముందస్తు సెలవు లేకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుందని ఆయన పేర్కొన్నారు. అదే జరిగితే పులివెందులలో ఉప ఎన్నికలు అనివార్యమని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా, తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన తులసిబాబు లాయర్‌గా నమోదు కాకుండానే వైఎస్ జగన్ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందని, దీనిపై సుప్రీంకోర్టుకు లేఖ రాయనున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.
రఘురామకృష్ణంరాజు చేసిన ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రఘురామకృష్ణంరాజు ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలను క్రింది వీడియోలో చూడవచ్చు: