RRC Railway Jobs 2025: దేశవ్యాప్తంగా ఉన్న యువతకు రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసేందుకు అద్భుతమైన అవకాశం లభించింది. నార్తర్న్ రైల్వే (RRC), రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ద్వారా వివిధ క్లస్టర్‌లలో ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 4,116 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, ఎంపిక విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సంస్థ పేరు: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, నార్తర్న్ రైల్వే (RRC, Northern Railway)
-
మొత్తం ఖాళీలు: 4,116
-
పోస్టు పేరు: అప్రెంటిస్ (Apprentice)
-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
-
దరఖాస్తు ప్రారంభం: 2025 నవంబర్ 25
-
చివరి తేదీ: 2025 డిసెంబర్ 24
భర్తీ చేసే ట్రేడ్‌లు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్, మెడిసిన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్ వంటి పలు ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
క్లస్టర్‌ల వారీగా ఖాళీల వివరాలు:
| క్లస్టర్ పేరు | ఖాళీల సంఖ్య |
| లక్నో (Lucknow) | 1,397 |
| దిల్లీ (Delhi) | 1,137 |
| అంబాల (Ambala) | 934 |
| ఫిరోజ్‌పుర్ (Firozpur) | 632 |
| మొరదాబాద్ (Moradabad) | 16 |
| మొత్తం | 4,116 |
ఇది కూడా చదవండి: YS Jagan: నాంపల్లిలో అలర్ట్.. ఆరేళ్ల తర్వాత కోర్టు ముందుకు వైఎస్ జగన్..!
అర్హతలు:
-
విద్యార్హత: అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదో తరగతి (10th Class) తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ (ITI)లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
-
వయోపరిమితి: 2025 డిసెంబర్ 24వ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
-
వయో సడలింపు: రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.100 చెల్లించవలసి ఉంటుంది. రిజర్వేషన్ వర్గాలకు (SC/ST/PwBD/మహిళలు) ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. అభ్యర్థులు తమ విద్యార్హతల్లో (పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు నిర్ణీత స్టైపెండ్ కూడా చెల్లించడం జరుగుతుంది.
ముఖ్య గమనిక: దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా నార్తర్న్ రైల్వే అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.

