RRB Railway Jobs 2025: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. 2025-26 సైకిల్‌కు ఈ నియామకం ద్వారా మొత్తం 6,391 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీలు, అర్హత, దరఖాస్తు ప్రక్రియ, జీతం వంటి వివరాలను తెలుసుకుందాం.
ఖాళీ వివరాలు: RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 అనే రెండు కేటగిరీల పోస్టులను భర్తీ చేస్తోంది. గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు 180 ఖాళీలు ఉండగా, గ్రేడ్ 3 పోస్టుకు 6,211 ఖాళీలు ఉన్నాయి.
వయోపరిమితి: గ్రేడ్ 1 అభ్యర్థుల వయస్సు జూలై 1, 2025 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రేడ్ 3 అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: వారంలో రెండుసార్లు విజిట్.. వారికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
విద్యార్హత: గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టుకు, అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్‌లో బీఎస్సీ డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌లో డిప్లొమా/డిగ్రీ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పోస్టుకు, అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై, ఫౌండ్రీమ్యాన్, మోల్డర్, ప్యాటర్న్ మేకర్, ఫోర్జర్, హీట్ ట్రీటర్ వంటి ట్రేడ్‌లలో ఐటీఐ లేదా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు సమర్పణ: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. అభ్యర్థులు RRB rrbapply.gov.in అధికారిక పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. జోన్ల వారీగా దరఖాస్తులను సమర్పించవచ్చు. జూన్ 28 నుండి జూలై 28, 2025 వరకు రాత్రి 11:59 గంటలకు దరఖాస్తులను సమర్పించవచ్చు

