Rohit Sharma: భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తన కొత్త లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వన్డేలపై దృష్టి పెట్టిన రోహిత్, రాబోయే ఆస్ట్రేలియా పర్యటన కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో దాదాపు 10 కిలోల బరువు తగ్గి, స్లిమ్‌గా మారాడు.రోహిత్ శర్మ కొత్త లుక్కు సంబంధించిన ఫోటోను అతని స్నేహితుడు, మాజీ భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. “10,000 గ్రాముల తర్వాత, మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం” అని నాయర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read: Asia Cup Final 2025: భారత్ vs పాకిస్తాన్.. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో తొలిసారి
ఈ మార్పుతో అభిమానులు రోహిత్‌ను “రోహిత్ 2.0” అని పిలుస్తున్నారు. గత కొంతకాలంగా తన ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలకు రోహిత్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సమాధానం చెప్పాడు. బీసీసీఐ ప్రవేశపెట్టిన కఠినమైన యో-యో , బ్రాంకో టెస్టుల్లో పాస్ అవ్వడానికి అతను ఈ ఫిట్నెస్ మార్పును సాధించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 38 ఏళ్ల రోహిత్, 2027లో జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే అతను తన ఫిట్‌నెస్‌పై ఇంతగా దృష్టి పెడుతున్నాడు. రోహిత్ శర్మ తిరిగి అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు.