Rohit Sharma: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో భారత జట్టు తరఫున రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో తన కనీస ఫామ్‌పై ఎదురైన ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ, మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ పై ఆడడం మానేసి ప్రస్తుతం రాబోతున్న మ్యాచ్ గురించి చర్చించడం అనేది ఎంతో ఉత్తమమని సూచించాడు మరి రోహిత్ శర్మకు చిరాకు తెప్పించిన ఆ ప్రశ్న ఏమిటీ..?
చాంపియన్స్ ట్రోఫీ మరియు ఇంగ్లాండ్ తో జరగబోయే ఎంతో కీలకమైన వన్డే సిరీస్ కి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మకు అసహనం తెప్పించే ప్రశ్నలు వేశారు. ఈ సిరీస్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందని ఒక విలేకరి ప్రశ్నించడం గమనార్ధం. ఈ ప్రశ్న విన్న వెంటనే రోహిత్ శర్మకు చిర్రెత్తుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Flight Crash: అమెరికాలో రెండు విమానాలు ఢీ.. ఏమి జరిగిందంటే…
దీంతో రోహిత్… “అసలు.. ఇదేం ప్రశ్న? ఆ ఫార్మాట్ వేరు, ఇది వేరు. రెండు ఫార్మాట్లకు పొంతన పెట్టే అవసరం ఏముంది? ఆటగాడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. ఇది కొత్త విషయం కాదు. నా ప్రయాణంలో ఇలాంటివి చాలా చూశాను. ప్రతి సిరీస్ కొత్త ప్రారంభాన్ని ఇస్తుందని నమ్ముతాను” అని అన్నాడు.
Rohit Sharma: తన క్రికెట్ భవిష్యత్తు గురించిన ఊహాగానాలపై కూడా హిట్ మ్యాన్ స్పందించాడు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పుకార్లు వస్తూనే ఉన్నాయి. వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఇక్కడకు రాలేదు. నా దృష్టి పూర్తిగా ఇంగ్లండ్‌తో సిరీస్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఆ తర్వాత ఏమైనా అప్పుడే ఆలోచిస్తాను అని రోహిత్ చెప్పారు. అలాగే, నేటి మ్యాచ్‌లో కీపర్‌గా రాహుల్‌కే అవకాశం ఉంటుందని తెలిపారు. షమికి మద్దతుగా మాట్లాడిన రోహిత్, బుమ్రా స్కాన్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు.
ఇక రోహిత్ శర్మ ఎంత ఈ విషయాన్ని పక్కన పెట్టినా… అతను ఫామ్ కోల్పోవడం అనేది తేటతెల్లమైన విషయమే. అంతే కాకుండా వయసు పై పడటం, పెద్దగా ఫిట్నెస్ కూడా లేకపోవడం అతనికి ప్రతికూల అంశాలుగా మారాయి. మరొకవైపు అతని స్థానంలో చోటు దక్కించుకొని తమని తమ నిరూపించుకునేందుకు యశస్వి జైస్వాల్ వంటి ఈ వాటగాళ్లు కాచుకొని కూర్చున్నారు. మరి ఇలాంటి సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాగైనా సత్తా చాటి మరికొద్ది కాలం జట్టులో కొనసాగాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడు. లేని పక్షంలో అతను కెప్టెన్సీ తో పాటు జట్టులో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.