Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ను కలిశారు. మనోజ్ తన సతీమణి భూమా మౌనికతో కలిసి శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యులను మీట్ అయ్యారు. మనోజ్, శివరాజ్ కుమార్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. మనోజ్, శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యుల ఫ్రెండ్లీ మీటింగ్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్, శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ను షేర్ చేస్తున్నారు. క్యాన్సర్ కు చికిత్స తీసుకుని కోలుకుంటున్న శివరాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మనోజ్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనోజ్ ఆకాంక్షించారు. ఇటీవల మిరాయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ కు శుభాకాంక్షలు తెలిపారు శివరాజ్ కుమార్.
